కృష్ణనదికి జలహారతి ఇవ్వనున్న ఎమ్మెల్యే
వంగూర్ మండలం తుమ్మలపల్లి గ్రామంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మండలంలోకి ప్రవేశించిన కృష్ణనది జలాలకు జలపూజ నిర్వహిస్తారని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన సర్పంచులు,తెరాస ప్రజాప్రతినిధులు,నాయకులు,తెరాస కార్యకర్తలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.