కాలువ మరమ్మతులు చేయించిన ఎంపీపీ
ఉప్పునుంతల మండలంలోని అన్ని గ్రామాలకు కేఎల్ఐ ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మండల నాయకులు తిప్పర్తి నరసింహ రెడ్డి అన్నారు.సోమవారం లత్తిపూర్ కుంట,గువ్వలోని పల్లి తదితర గ్రామాలకు సాగునీరు అందించడం కోసం, డిండి కుడి కాలువ నుండి మరింత సాగునీరు రావడం కోసం కాలువల వెంట వున్న రాళ్లు, కంపచెట్లు తొలగించినట్లయితే రోడ్డు అవతలి గ్రామాలకు మరింత సాగునీరు అందుతుందని కాలువకు మరమ్మతులు చేయించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో లత్తిపూర్ సర్పంచ్ మల్లేష్,ఎంపీటీసీ మల్లేష్ యాదవ్,నాయకులు లింగమయ్య,రంగారెడ్డి,బాలరాజు,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.