కార్మిక వేతనాల కోడ్ -2019 బిల్లు
వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించే వేతనాల కోడ్ -2019 బిల్లును రాజ్యసభ ఆమోదించింది.దీనివల్ల దేశ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు లాభం కలుగుతుందని కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక సంఘాలు, యజమానులు ప్రాతినిధ్యం వహించే త్రిసభ్య కమిటీలే కనీస వేతనాలను నిర్ణయిస్తాయన్నారు. జూలై 30వ తేదీన ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందగా,నేడు రాజ్య సభ ఆమోదం పొందింది.