కాంసానిపల్లి లో పంటలను పరిశీలించిన ఏవో
ఉప్పునుంతల మండలంలోని కాంసానిపల్లి గ్రామంలోని పంటపొలాలను గురువారం వ్యవసాయ అధికారులు పరిశీలించారు.విత్తనోత్పత్తి పథకంలో భాగంగా రైతులు సాగుచేసిన పంటలను పరిశీలిస్తూ తగు జాగ్రత్తలను తీసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. ప్రత్తి,పల్లి,వరి, కందులు వంటి పంటలను పరిశీలించిన అనంతరం పంటలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏవైనా చీడ, పీడలు మరియు వైరస్,ఫంగస్ లాంటివి సోకితే అధికారులను సంప్రదించి తగిన మందులు వాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణ,జడ్పీటీసీ అనంత ప్రతాప రెడ్డి,సర్పంచ్ లక్ష్మినారాయణ,గ్రామస్తులు పాల్గొన్నారు.