కాంగ్రెస్ కు రాములమ్మ గుడ్ బై..! బీజేపీలోకి రీ ఎంట్రీ ఖాయం: ముహూర్తం ఫిక్స్..!
కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి దాదాపు ముగింపు లభిస్తోంది. అంచనా వేసిన విధంగానే ప్రముఖ సినీ నటి..తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ వీడటం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే బీజేపీ నేతలు రాములమ్మను తిరిగి బీజేపీలోకి రావాలని మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులు..నాయకత్వం మద్య కొరవడిన సమన్వయంతో విజయ శాంతి మనస్పూర్తిగా పార్టీలో ఇమడలేకపోతున్నారని చెబుతున్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు రాములమ్మ దూరంగా ఉంటున్నారు.
ట్విట్టర్ ద్వారా కేసీఆర్ మీద ..ప్రభుత్వం మీద విమర్శలు చేయటం మినహా యాక్టివ్ రాజకీయాలు చేయటం లేదు. ఇదే సమయంలో..కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే ఇక బీజేపీలోకి వెళ్లటమే మార్గంగా విజయశాంతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..రాములమ్మ బిజేపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఇందు కోసం ముహూర్తం సైతం ఫిక్స్ అయింది.