కరెంటు పోల్ ఎక్కిన ఆర్టీసీ కార్మికుడు
అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపో కి చెందిన డ్రైవర్ అత్యంత ప్రమాదకరమైన 200 కె.వి విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.అచ్చంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న హరిశ్చంద్ర అనే 28 సంవత్సరాల యువకుడు ఆర్టీసీ సమ్మెలో భాగంగా ధర్నాలో పాల్గొన్నాడు.కాగా ఆర్టీసీ సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆవేదన చెందిన హరిశ్చంద్ర శుక్రవారం సాయంత్రం విధ్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.ఎవరైన తనను రక్షించేందుకు ప్రయత్నిస్తే విధ్యుత్ తీగలు పట్టుకుంటానంటూ హెచ్చరించాడు.దానితో రంగంలోకి దిగిన పోలీసులు హరిశ్చంద్రకు నచ్చజెప్పి కిందకు దింపారు.