కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అటువంటి ఉల్లి నేడు ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఉన్న ధర నేడు ఉండటంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు రెట్టింపవుతోంది. నెల రోజుల కిందట కేవలం రూ.20 ఉన్న ఉల్లి ధర బుధవారం రూ.60కు ఎగబాకింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వ్యాపారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం పండుగలు వస్తుండటం, ప్రతి వంటలోనూ ఉల్లి తప్పనిసరి కావడంతో సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు.
ఇక నైనా ప్రభుత్వాలు దృష్టి సారించి ధరలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.