ఒకే గ్రామంనుంచి 11 మంది పోలీస్ కానిస్టేబుల్స్‌గా ఎంపిక
మంగళవారం విడుదలపైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని యువకులు సత్తాచాటారు. మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంనుంచి 11 మంది యువకులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆరె అనిల్, గాలి అజయ్‌కుమార్, లక్కర్సు వంశీకృష్ణ, బొల్ల సతీశ్, కానిగంటి మహేశ్, బొమ్మెన రమేశ్, మేకల కుమార్, మద్ది అనిల్, కానిగంటి అనిల్, బిల్ల సాయికుమార్, పొతరాజు రాజేందర్ ఎంపికైన వారిలో ఉన్నారు. వీరంతా నిరుపేద కుటంబానికి చెందిన వారే.
ఎంపికైన వారందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవడం మరో విశేషం. వీరంతా పట్టుదలతో శ్రమించి ఉద్యోగాలు సాధించినందుకు స్థానిక గ్రామ సర్పంచ్ బొల్ల వేణుగోపాల్, ఎంపీటీసీ గడ్డి రేణుక సంతోషం వ్యక్తం చేశారు. వారిని అభినందించారు. అలాగే, వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామం నుంచి ఏడుగురు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నారాయణదాసు అశ్విని, పూసాల పద్మ, నారాయణదాసు ప్రశాంత్, సింగరవేణి వంశీ, పూసాల వంశీ, కోట అరుణ్‌కుమార్, మ్యాకల రాజు ఎంపికైన వారిలో ఉన్నారు. వారిని సర్పంచ్, గ్రామస్తులు అభినందించారు.