ఒకవైపు డెడ్ లైన్-మరోవైపు పోరాటం
సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెకు మంగళవారం డెడ్లైన్ గా విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. కానీ ఆర్టీసీ నాయకులు యధావిధిగా తమ సమ్మె కార్యక్రమాలను కొనసాగించారు.రోజులాగే నిరసనలు,ర్యాలీలు,వామపక్షాల నేతల ఉపన్యాసాలతో తమ పోరాటాన్ని కొనసాగించారు.
మధ్యాహ్నం పట్టణ ప్రధాన రహదారి పై ప్రభుత్వానికి,సీఎం కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళ కండక్టర్లు,ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు.
ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుందాం,ఆర్టీసీ ప్రైవేట్ పరం కానివ్వం,హరీష్ రావు నేతృత్వంలో చర్చల కమిటీ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.