ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థుల అస్వస్థత
అచ్చంపేట నియోజక వర్గంలోని బల్మూర్ మండలం గట్టుతుమ్మేన్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. పాఠశాలలోని విద్యార్ధులకు ఐరన్ మాత్రలు వేయగా వారిలో 33 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురి అయ్యారు. దానితో ఆందోళనకు గురి అయిన ఉపాధ్యాయులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సందర్బంగా డా.సిరాజ్ మాట్లాడుతూ…విద్యార్థులు ఐరన్ మాత్రలు తీసుకున్న గంట తర్వాత ఆహారం తీసుకున్నారు.ఈ క్రమంలో మాత్రల వల్ల లేదా ఆహారం వలన కానీ ఇలా జరిగి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు.