ఐదో వన్డేలో భారత్ ఓటమి.

కీలకమైన ప్రపంచకప్‌నకు ముందు.. భారత్ ఆఖరి షో.. అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చూడటానికి పెద్ద లక్ష్యమూ కాదు.. ఆడటానికి అనువుగాలేని పిచ్ కూడా కాదు.. కాస్త నిలబడితే చాలు పరుగులు వాటంతట అవే వచ్చే పరిస్థితుల్లో విరాట్ వీరులు అలసత్వం చూపెట్టారు. సొంతగడ్డ అన్న ధీమానో.. లేక ఆసీస్‌లో స్టార్లు లేరన్న హేళనోగానీ.. చేజేతులా వన్డే సిరీస్‌ను చేజార్చుకున్నారు. దీనికితోడు ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిన ఏ ప్రయోగం ఫలించకపోగా.. తుది కూర్పు
అంచనాలన్నీ తారుమారయ్యాయి. మరోవైపు సమిష్టితత్వానికి నిదర్శనంగా నిలిచిన కంగారూలు.. సొంతగడ్డపై తమకు ఎదురైన వరుస పరాజయాలకు ఘనమైన ప్రతీకారం తీర్చుకున్నారు. ఉస్మాన్ ఖవాజ(106 బంతుల్లో 100; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగిన వేళ.. కోట్లా కొట్లాటలో మొనగాళ్లుగా నిలిచి సిరీస్‌ను ఎగురేసుకుపోయారు