ఐకేపీ, ఉపాధిహామీ పథకం పై నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

and
అచ్చంపేట పట్టణంలో బుధవారం ఉదయం 11 గంటలకు అచ్చంపేట నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ ఇందిరా క్రాంతి పథం,ఉపాధి హామీ పథకం పై నియోజకవర్గ స్థాయి సమీక్ష కార్యక్రమం నిర్వహించారు.నియోజక వర్గ కేంద్రంలోని సత్యలక్ష్మి కళ్యాణమండపంలో నిర్వహించిన సమావేశంలో ఈ పథకాల అమలు తీరుపై అధికారులతో చర్చించారు.
అనంతరం పథకాల అమలుకై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సమావేశానికి అన్ని మండలాల నుంచి సంబంధిత శాఖ అధికారులు,ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.