ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలి
అచ్చంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని గిరిజన సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు దశరథ్ నాయక్ అధికారులను కోరారు.
శనివారం అమ్రాబాద్ మండల కేంద్రంలో ఆయన టిఆర్టి అభ్యర్థులతో కలసి అధికారుల సమావేశంలో పాల్గొని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.