ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఎన్నిక
భారతీయ విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)అచ్చంపేట నూతన డివిజన్ కమిటీని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అశోక్ సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా ఎం.డి.సయ్యద్, ప్రధాన కార్యదర్శిగా ఆర్.రాంబాబు,ఉపాధ్యక్షుడిగా రాజు, శంకర్, ఆంజనేయులు, సహాయ కార్యదర్శిగా అనూష, శివ, అనిల్ తరుణ్ లతో పాటు 18 మంది డివిజన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
ఈ సమావేశంలోని తీర్మానాలు:
* డివిజన్ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి.
* అటవీ, పశువులు మరియు సంరక్షణ, ఉద్యానవన కళాశాలల ఏర్పాటు చేయాలి.
* విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.
* ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
* ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలను అరికట్టాలి.