ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్యాంపు కార్యాలయం ముట్టడి
అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికులు,డ్రైవర్లు,కండక్టర్లు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు.కార్మికులు గత 38రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఆర్టీసీ యూనియన్ నేత ప్రభాకర్ మాట్లాడుతూ…
సీఎం నిరంకుశ వైఖరి వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని,హై కోర్ట్ ను సైతం కెసిఆర్ లెక్కచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన పిఎకు వినతిపత్రం అందజేశారు.