ఎక్స్ సర్వీస్ మెన్ కూతురుకు ఎంబిబిఎస్ లో సీటు సన్మానించిన ఎమ్మెల్యే
◆ఎక్స్ సర్వీస్ మెన్ కూతురుకు ఎంబిబిఎస్ లో సీటు సన్మానించిన ఎమ్మెల్యే◆
కొంకి విజయ్ ఇందిర (ఎక్స్ సర్వీస్ మెన్) కూతురు కె.వైష్ణవి కి ఎం.బి.బి.ఎస్ 2019లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీటు సాధించారు. కె.వైష్ణవి ఎం.బి.బి.ఎస్ ఎంట్రన్స్ లో 1500 స్టేట్ ర్యాంకు సాధించింది. అచ్చంపేటలో 1 నుండి 10 వ తరగతి వరకు ఆక్స్ ఫర్డ్ లో చదువుకుందని, కళాశాల శ్రీ గాయత్రి హైదరాబాద్ లో చదువుకొని మొదటి ప్రయత్నంలోనే ఎంసెట్ ర్యాంకు సాధించిందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విద్యార్థినిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మందే వెంకటయ్య, అంతటి రామకృష్ణ,మీసాల ప్రభాకర్,ఉల్పర శ్రీరాములు,లాలయ్య, నారాయణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.