ఎంపీ,ఎమ్మెల్యే ను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
అచ్చంపేట పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తాలో ఎంపీ పి. రాములు,ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.గత 40 రోజులుగా సమ్మె చేస్తున్న పట్టించుకోరా? మీరు ఎందుకు స్పందించడం లేదని వారిని ప్రశ్నించారు.దాదాపు 20 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న చోద్యం చూస్తూ వున్నారని ఎంపీ రాములును కార్మికులు ప్రశ్నించారు.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ…ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్య పరిష్కారానికి మావంతు కృషి చేస్తానని ఆయన చెప్పడంతో కార్మికులు శాంతించారు.