ఎంపియుపిఎస్ రంగాపూర్ లో ఎంపీపీ,ఎంపీడీవో,ఎంఈవో,సర్పంచులకు ఘన సన్మానం
◆ఎంపియుపిఎస్ రంగాపూర్ లో ఎంపీపీ,ఎంపీడీవో,ఎంఈవో,సర్పంచులకు ఘన సన్మానం◆
మంగళవారం గురుపూర్ణిమ వేడుకలు ఎంపియుపిఎస్ రంగాపూర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ఎంపీపీ శాంతాబాయి ఎంపీడీవో ఎంఈఓ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ హాజరయ్యారు.
జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం వల్లనే సమాజంలో అభివృద్ధి, శాంతి నెలకొంటాయని అందుకు పాఠశాలలు వేదిక కావాలని ఎంపీడీవో సురేష్ కుమార్ అన్నారు.
అనంతరం ఎంఈవో రామారావు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో భాగం అని, మంచి విద్యను అందిస్తే మంచి సమాజం ఏర్పడుతుందని అన్నారు. గురుపూర్ణిమ ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు చక్కగా వివరించారు.
పాఠశాల సమస్యల పై స్పందించిన ఎంపీపీ శాంతాబాయి గారు త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
నూతన తరగతి గదుల నిర్మాణం, నీటి వసతి, ప్రహరీ నిర్మాణం వంటి సమస్యలు పరిష్కరిస్తామని, పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి తన వంతు సహకారం అందిస్తామని అన్నారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎంపీపీ శ్రీమతి శాంతాబాయి గారిని,సర్పంచ్ లోకనాయక్ గారిని,ఉప సర్పంచ్ శ్రీ నాగేష్ గారిని, నూతన ఉపాధ్యాయుడు రామకృష్ణచారిగారిని పాఠశాల సిబ్బంది మరియు ఎంఈఓ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపి శాంతాబాయి, ఎంపీడీవో సురేష్ కుమార్,ఎంఈఓ ఆర్.రామారావు, సర్పంచ్ లోక్యనాయక్,ఉప సర్పంచ్ నాగేష్, ప్రధానోపాధ్యాయుడు ఎస్.కె చాంద్ పాషా, పాఠశాల ఉపాధ్యాయులు ఆర్.హన్మ, డి.శివ,బి.శంకర్ ఏ.రామ కృష్ణ చారి,సింధు,సుప్రియ,
గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.