ఉల్లి ధరలు ఘాటు
ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొన్ని రోజుల క్రితం కిలో 20 రూపాయలుగా ఉన్న ఉల్లి ప్రస్తుతం మార్కెట్లో 40 రూపాయలు కిలోగా కొనసాగుతుంది.ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.
ఉల్లి ధరలు రెట్టింపు కావడంతో సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు.కిలో కొనాల్సిన చోట అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నాడు. వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో ఉల్లి ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.