ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్న హైకోర్టు రిటైర్డ్ జడ్జి
శ్రీ ఉమామహేశ్వర క్షేత్రాన్ని హైదరాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి వెంకటరమణ దంపతులు దర్శించుకున్నారు.ఈ సందర్బంగా వారిని గౌరవంగా ఆహ్వానించిన అనంతరం అర్చకులు వారితో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కందూరు సుధాకర్ గారు జడ్జి వెంకటరమణ దంపతులకు శాలువా కప్పి సన్మానించడం జరిగింది.ఆహ్లాదకరమైన, పవిత్రమైన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రానికి వచ్చినందుకు ఆనందంగా ఉందని,ఆలయ అభివృద్ధి చాలా బాగుందని వారు ప్రశంసించారు.