• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

ఉమామహేశ్వర క్షేత్రం లో అమ్మవారికి బంగారు నగల బహూకరణ

Share Button

శ్రీశైల ఉత్తర ద్వారం శ్రీ ఉమా మహేశ్వర ఆలయంలో ఉమదేవి అమ్మవారికి నాగర్ కర్నూల్ కు చెందిన భక్తులు తీగల మనం బాలస్వామి దంపతులు మూడు తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలను సమర్పించారు.
గత జనవరిలో జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కోరిన మొక్కు తీరడంతో ఈ బంగారు ఆభరణాలను సమర్పించినట్లుగా వారు తెలియజేశారు.దాతలు సోమవారం ఉమామహేశ్వర క్షేత్రం దర్శించి నగలను ఆలయ చైర్మన్ సుధాకర్ గారికి అందజేశారు.

ఆ పురాణాల విలువ సుమారు ఒక లక్ష నలబై నాలుగు వేలుగా వారు తెలియజేశారు.ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు చైర్మన్ సుధాకర్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దాతలు తీగల మణెమ్మ బాలస్వామి దంపతులు,కుటుంభ సభ్యులు గోపాల్,భాగ్యలక్ష్మి, యాదమ్మ,శ్రీనివాసులు,దివ్య,శరత్ చంద్ర,శ్రీవేద్,కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీనివాస రావు,దేవాలయ సిబ్బంది రామకృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat