ఉమామహేశ్వర క్షేత్రంలో నిత్య అన్నదానానికి విరాళాలు అందజేస్తున్న భక్తులు
దాతల సహాయ సహకారాలతో శ్రీశైలం ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.ఆలయ కమిటీ సభ్యులు ఉమామహేశ్వర క్షేత్రంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది.ఈ సందర్భంగా పలువురు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తు,పెద ఎత్తున తమ విరాళాలను ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్ గారికి అందజేశారు.