ఉపాధ్యాయ సమస్యలపై నిరసన
కేజీబీవీ ఉపాధ్యాయ సమస్యల సాధన కొరకై శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో వంగూరు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ నిరసనలో జిల్లా కార్యదర్శి చిన్నయ్య మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ఐక్యత ఉపాధ్యాయ ఫెడరేషన్ కమిటీ పిలుపు మేరకు కేజీబీవీ యుఆర్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ తో సమానంగా అన్ని సెలవులు వర్తింపజేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని,సర్వీస్ రెగ్యులర్ చేస్తూ జనంతో కూడిన మెటర్నటీ సెలవులను మంజూరు చేయాలని,ప్రతి కేజీబీవీ పాఠశాలకు వార్డెన్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శి లింగమయ్య,జంగయ్య తో పాటు జిల్లా నాయకులు బక్కయ్య, సీ.జంగయ్య,అనిల్ కుమార్,కృష్ణయ్య,స్పెషల్ ఆఫీసర్ కృష్ణవేణి,ఇతర ఉపాధ్యాయ బృంద సిబ్బంది పాల్గొన్నారు.