ఉత్తరేణి ఒక రకమైన ఔషధ మొక్క ఉపయోగాలు
ఉత్తరేణి ఒక రకమైన ఔషధ మొక్క. దీనిని వ్యవహారిక భాషాలో కుక్కచీరిక అని కూడా పిలుస్తారు.దీనిలో ఎన్నో రోగాలను నయం చేసే ఆయుర్వేద గుణం ఉంది.
ఉత్తరేణి ఉపయోగాలు:
1)ఉత్తరేణి గింజలను సేకరించి నీడలో ఆరబెటి మెత్తని పొడి చేసి వస్త్రగలితం చేసి, ఆ పొడిని మూర్ఛరోగం ఉన్నవారు రోజు ఉదయం చిటికెడు నష్యంగా(ముక్కులోకి) పీల్చాలి. ఇలా చేస్తే ఎంతటి కఠినమైన మూర్ఛ అయిన తగ్గి పోతుంది.
2)ఉత్తరేణి ఆకుల రసం కడుపునొప్పికి, అజీర్తికి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.
3)ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
4)కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.
5)ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి.
6)ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.
7)ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
you
8)ఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.
9)నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.
ఆచరిస్తే ఫలితం మీరే చూస్తారు .