ఉచిత పథకాలు వద్దు

Gopalpeta-buddaram-highschool
ఉచిత పథకాలువద్దు
ప్రభుత్వం, ఉన్నతాధికారులు విద్య వైద్యంపై దృష్టి పెట్టాలి. పడిపోతున్న పాఠశాలలపై శ్రద్ధ వహించండి. పాఠశాలల్లో, ఆసుపత్రులలో తగినన్ని పోస్టులు నింపాలని, జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యేకు అఖిలపక్ష ఐక్యవేదిక వినతి.
ఈరోజు గోపాల్పేట హైస్కూల్, బుద్ధారం హై స్కూల్, వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలుగువాడ హైస్కూల్ సందర్శించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్. ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఉదయం గోపాల్పేట హైస్కూల్లో టీచర్లకు ముఖచిత్రం క్యాలెండర్లు పంపిణీ చేసిన తర్వాత, అక్కడ హై స్కూల్ పరిశీలన చేయడం జరిగింది. గోపాలుపేట్ హైస్కూల్లో అటెండర్లు, పి.ఈ.టీ లు ఒక్కొక్కరే ఉండి ఇబ్బందిగా ఉందని, స్కూల్ కూడా అభివృద్ధి చేయాలని, ఆ తరువాత బుద్ధారం స్కూల్ పరిశీలించడం జరిగిందని, అక్కడ స్కూల్లో కొన్ని రూముల పై కప్పు పడిపోయని, స్కూల్ దీనావస్థితిలో ఉందని, వెంటనే దానికి సంబంధించిన నిర్మాణం చేయాలని, అక్కడ విద్యార్థులకు కష్టంగా ఉందని మరిచిపోయి ఆ రూముల దగ్గరికి వెళ్తే పైన పడే ప్రమాదం ఉందని తెలిపారు. achampet
వనపర్తి తెలుగువాడ స్కూల్ ఈ మధ్యనే సందర్శనార్థం వెళితే స్కూలు చాలా యిరుకుగా ఉందని నేను చదివినప్పుడు ఎలా ఉందో అలాగే ఉందని, మా స్కూలు విస్తరించాలని, అక్కడ విద్యార్థులకు ప్రార్ధన స్థలం ఇబ్బందిగా ఉంటే ఎమ్మెల్యే మెగా రెడ్డి ద్వారా ఫోన్ చేయించి ఇబ్బందిగా ఉన్న ఆ స్థలాన్ని జె.సి.బి లతో శుభ్రం చేయించడం జరిగిందని ఆ పాఠశాల హెచ్.ఎం, టీచర్లు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారని ఆ ప్రదేశాన్ని కూడా పరిశీలించామని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు ఆయా స్కూల్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin