ఇవాల్టీ నుంచి తెలంగాణ సచివాలయానికి తాళం
తెలంగాణ పాత సచివాలయాం ఇవాల్టీ నుంచి మూతపడనుంది. పాత సచివాలయ గేటుకు తాళం పడనుంది. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ కొత్త సచివాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీంతో పాత భవనాన్ని మూసివేయాలని సీఎం గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత రెండు నెలలుగా సచివాలయంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నింటిని బూర్గుల రామకృష్ణ భవనానికి అధికారులు తరలించారు.
పలుసార్లు సీఎం ఆదేశించిన కార్యాలయం తరలింపులో జాప్యం జరుగుతుండటంతో సీఎస్‌పై గులాబీ బాస్ సీరియస్ అయినట్లు కూడా సమాచారం. అయితే కొందరు అధికారులు మాత్రం కార్యాలయాన్ని తరలించిన సచివాలయం నుంచే పనులు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది మంత్రుల శాఖలకు చెందిన అధికారులు కూడా సచివాలయం నుంచే పనులు నిర్వహిస్తున్నారు. దీనిపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం వరకు అన్ని శాఖల్ని తరలించి… సోమవారం ఉదయానికి సచివాలయం భవనానికి తాళం వేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.