ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొన్న జడ్పీటీసీ
ఉప్పునుంతల మండలంలోని ఉప్పరిపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం మరియు యజ్ఞంలో జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి కుటుంభ సమేతంగా పాల్గొన్నారు.
గ్రామంలో గతంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని పునరుద్దరించే కార్యక్రమాన్ని బుదవారం చేపట్టారు. వేదపండితుల మంత్రోఛ్చరణల మధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంద్రారెడ్డి,వార్డు మెంబర్లు,గ్రామప్రజలు పాల్గొన్నారు.