ఆలయ అభివృద్ధి పనులు పర్యవేక్షించిన పర్యాటక శాఖ
ఉమామహేశ్వరం ఆలయం ఆవరణలో పర్యాటక శాఖ అధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆశాఖకు చెందిన అధికారులు పరిశీలించారు.పర్యాటక శాఖ అధ్వర్యంలో రూ.10 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి.వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే బ్రహ్మోత్సవాలలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, దీంతో పనుల ప్రగతిని పరిశీలించేందుకు పర్యాటక శాఖ ఈడి శంకర్ రెడ్డి,రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ సంచాలకురాలు లక్ష్మి, ఎస్ఈ సరిత,డిఈ హనుమంత రెడ్డి తదితరులు పనులు పరిశీలించారు.
అంతకుముందు ఆలయ ఛైర్మన్ సుధాకర్ వారికి సాదరంగా ఆహ్వానించారు.
దాతల సహకారంతో చేసిన అభివృద్ధి పనులను వారికి వివరించారు.
వారు పాపనాశినిలో పుణ్య స్నానం ఆచరించి ఆలయంలో పూజలు నిర్వహించారు.