ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఎంపికైన గ్రామ యువకులు
ఇటివల కరీంనగర్ లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఒకే గ్రామానికి చెందిన తొమ్మిది మంది యువకులు ఎంపికయ్యారు.
బల్మూర్ మండలంలోని తోడేళ్ళగడ్డ గ్రామానికి చెందిన తొమ్మిది మంది యువకులు ఒకేసారి ఎంపికవ్వడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంపికైన యువకులలో హరీష్,మహేష్, వెంకటేష్,భరత్,రామకృష్ణ,శంకర్,శ్రీను,లక్ష్మణ్,శ్రీకాంత్ లు ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న యువకుల తల్లితండ్రులు,బందువులు ఆనందోత్సాహలలో మునిగిపోయారు.
ఇక్కడ మరొక్క విశేషం ఏమిటంటే ఈ తొమ్మిది మంది యువకులు ప్రాణ స్నేహితులు కావడం.