ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సైన్యం చేరి దేశానికీ సేవ చేయాలనుకునే యువతకు ఇండియన్ ఆర్మీ సువర్ణ అవకాశం కల్పించింది.17 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనుంది.
కరీంనగర్ వేదికగా అక్టోబర్ 7 నుంచి 17వ తేది వరకు నిర్వహించే ర్యాలీలో తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన యువకులకు అవకాశం కల్పించనుంది.దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం నుండి ప్రారంభమై వచ్చే నెల 22 వరకు కొనసాగనుంది.