ఆర్మీ జవాన్ రాజశేఖర్ (చిన్న) కారు ప్రమాదం లో మృతి చెందారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన రాజశేఖర్ (చిన్న) అనే భారత జవాన్
కాశ్మీర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో తన విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల నిమిత్తం తన స్వంత గ్రామమైన అచ్చంపేట కు వస్తుండగా మార్గం మధ్యలో కల్వకుర్తి సమీపం లో కిష్టం పల్లి గేటు వద్ద కారు బోల్తా పడి రాజశేఖర్ (చిన్న) చనిపోయాడు.
ఈ విషయం తెలిసిన తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కన్నీరు మున్నీరయ్యారు విషాదం లో ఉన్న తన కుటుంబానికి భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అండగా నీలిచి తగిన సహాయం చేయాలనీ అందరు ఆకాంక్షితున్నారు.