ఆర్డీవో కార్యాలయం వద్ద రైతుల ఆందోళన

అచ్చంపేట మండల పరిధిలోని దేవులా తండాలోని గిరిజన రైతుల భూములను మండల ఆర్ఐ రాములు,గతంలో తహసీల్దారుగా పనిచేసిన ప్రస్తుత ఆర్డిఓ పాండు లంచాలు తీసుకుని మా పేరున ఉన్న పట్టా భూములను ఇతరుల పేరున రికార్డులు తయారు చేసి,మా భూములు మాకు దక్కకుండా చేశారని బాధిత రైతులు ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.మండలంలో రెవెన్యూ భూముల అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపి నల్లమల్ల రైతులకు తగిన న్యాయం చేయాలని గిరిజన రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.