ఆర్డీటి సంస్థ ఆధ్వర్యంలో ఆహార ధాన్యాల పంపిణి
అచ్చంపేట పట్టణంలోని ఆర్డీటి సంస్థ ఆధ్వర్యంలో అనాధ వృద్ధులకు టీవీ,హెచ్ఐవి పేషంట్లకు ఆహార ధాన్యాలను పంపిణి చేశారు.దేశంలో ఎవరూ ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశ్యంతో డాక్టర్ ఫాదర్ ఇన్సెంట్ పెరర్ ప్రపంచంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది.సంవత్సరానికి రెండు పర్యాయాలుగా ఆరు నెలలకు ఒకసారి చొప్పున ఒక్కొక వ్యక్తికి గోధుమలు ఆరు కిలోలు,రాగులు ఆరు కిలోలు,కంది పప్పు మూడు కిలోలు,మంచి నూనె మరియు పద్దెనిమిది కిలోల బియ్యం అందజేయనున్నారు.కుటుంబంలో ఎవరికైన పక్షవాతం వచ్చినట్లయితే రెట్టింపు ధాన్యం అందజేయడం జరుగుతుందని ఆర్డీటి ఇన్చార్జి సరస్వతి తెలిపారు.