ఆర్డిఓ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం

0

అచ్చంపేట డివిజన్ కార్యాలయంలో ఆర్డిఓ ఆర్.పాండు ఆధ్వర్యంలో డివిజన్లోని వివాదాస్పద భూములపై విచారణను వేగవంతం చేశారు.

భూప్రక్షాళనలో భాగంగా డివిజన్ పరిధిలోని మండలాల వారీగా వివాదాస్పద భూములను సర్వే నెంబర్ల ఆధారంగా అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఈ సందర్భంగా పిటిషన్ దారులు తమకు చెందిన భూమి యొక్క పత్రాలను, ఆధారాలను ఆర్డివో గారికి, అధికారులకు అందజేశారు.

భూములకు సంబందించిన పత్రాలు, ఆధారాలను పొందుపరచిన అనంతరం సరియైన వ్యక్తులకు భూమి యాజమాన్య హక్కులను కల్పించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *