ఆర్టీసీ సమ్మె@9వ రోజు

ఆర్టీసీ సమ్మే 9వ రోజుకి చేరింది. దీనితో ఆర్టీసీ కార్మికుల
పోరాటాన్ని తీవ్రతరం చేశారు. అలాగే వివిధ సంఘాల మద్దతు కూడా దక్కడంతో ఆర్టీసీ సంఘాలలో ఉత్సాహాన్ని నింపింది. అచ్చంపేటలోని ధర్నా వేదికకు ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు,ఉద్యోగ సంఘాల నాయకులు తరలివచ్చి తమ పూర్తి మద్దతు తెలియజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయాలనీ చూస్తుందని, అదే జరిగితే ఆర్టీసీ నియంత్రణ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లి ప్రజల పై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి మద్దతు ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, సమ్మెను విరమింపచేసే భాద్యత ప్రభుత్వాన్నిదేనని స్పష్టం చేశారు. సమ్మె కార్మికుల హక్కన్ని, దాని హరించే అధికారం ఎవరికీ లేదని గుర్తుచేశారు. సమ్మె చేసిన వారిని తొలగిస్తామని చెప్పడం భాద్యతరాహిత్యమని, మరొక్కసారి ఈ విషయం పై పునరాలోచించుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు తమ సంఘీభావం తెలిపారు.