ఆర్టీసీ సమ్మెలో మహిళా కండక్టర్ల దీక్ష
ఆర్టీసీ సమ్మెలో భాగంగా గురువారం మహిళా కండక్టర్ల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు.ఉదయం పది గంటలకు అచ్చంపేటలోని ధర్నాదీక్ష వద్ద ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష సాయంత్రం ఆరు గంటలకు కొనసాగింది. అనంతరం ఆర్టీసీ కార్మికులు నిమ్మరసం ఇచ్చి మహిళా కండక్టర్ల దీక్ష విరమింపజేశారు.
పోలీసులు దీక్ష శిబిరం చుట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.