ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
అమ్రాబాద్ మండల కేంద్రంలోని పాఠశాలల ఉపాధ్యాయులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరి వీడి వారితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పాండు మాట్లాడుతూ…ఆర్టీసీ కార్మికుల సమ్మె పై సీఎం కెసిఆర్ నిర్లక్ష వైఖరి మార్చుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయ,ఉద్యోగ సమస్యలు కూడా తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారు ప్రకటించే కార్యాచరణలో ఉపాధ్యాయులు అందరు కలిసి పాల్గొంటామని,అన్ని సంఘాల వారు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల కార్యదర్శి తుకారాం,యూటిఎఫ్ నాయకులు శ్రీరాం,శంకర్,ఉపాధ్యాయులు లింగారెడ్డి,కృష్ణయ్య,పూల్య,కౌసల్య,కృష్ణవేణి,మేనక,స్వప్న తదితరులు పాల్గొన్నారు.