ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్,కండక్టర్ పై దాడి
అచ్చంపేటలోని అంబెడ్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకుని టైరులలో గాలి తీశారు.బస్సు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్,కండక్టర్ పై దాడి చేశారు. అనంతరం బస్సులు నడపకుండా రోడ్డుపై అడ్డంగా పడుకున్నారు.మా ప్రాణాలనైనా వదులుతాం కానీ బస్సును మాత్రం ముందుకు కదలనివ్వబోమని మొండికేశారు.పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది.ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుంది.