ఆర్టీసీ కార్మికుల మానవహారం
ఆర్టీసీ కార్మికుల పదవ రోజు సమ్మెలో భాగంగా సోమవారం అంబెడ్కర్ కూడలి వద్ద ప్రధాన రహదారి పై మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు.ఈ నిరసనలో ఉపాధ్యాయ సంఘం పిఆర్టియు నేతలు కూడా పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్బంగా వారు ప్రభుత్వానికి,సీఎం కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ధర్నా వేదికకు చేరి ధర్నాలో పాల్గొన్ని మాట్లాడారు. తాము జీతాలు పెంచమని సమ్మె చేయడం లేదని, సంవత్సరాల నుండి ఈ సంస్థనే నమ్ముకుని బ్రతుకుతున్నమని, సంస్థను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన మానుకుని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకుందాం అనే నినాదానాలతో వేదిక మారుమ్రోగింది.
ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుని మృతికి నివాళులు అర్పించారు.పరిస్ధితి అదుపు తప్పకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.