ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించిన డీసీసీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో సీఎం కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారని డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఆరోపించారు.కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 36రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్యను పరిష్కరించాల్సిన సీఎం కేసీఆర్ నియంతల వ్యవహరిస్తూ,కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్మికులు చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం నిర్వహిస్తే పోలీసుల చేత మహిళలు అని కూడా చూడకుండా దాడులకు పాల్పడడం కెసిఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు.