ఆర్టీసీ కార్మికులకు వెయ్యిరూపాయలు విరాళంగా ఇచ్చిన వృద్ధుడు
అచ్చంపేటలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై చెలించి పోయిన ఓ వృద్ధుడు వెయ్యి రూపాయలు విరాళంగా ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశాడు.బల్మూరు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వృద్ధుడు కోట్ల జంగయ్య అచ్చంపేట బస్టాండ్ లో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.మంగళవారం దీక్షా శిబిరంలో ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల వద్దకు వచ్చి వారితో పాటు బైఠాయించి, తన వద్ద సంచిలో ఉన్న డబ్బులను వారికి ఇచ్చివేసాడు.వెంటనే ఆర్టీసీ కార్మికులు జంగయ్య కు పూలమాలతో ఘనంగా సన్మానించారు.