ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీఎం దిష్టి బొమ్మను దహనం చేసిన సిపిఎం నాయకులు
సిపిఎం మండల పార్టీ అధ్వర్యంలో అచ్చంపేట మండల కేంద్రంలోని అంబెడ్కర్ కూడలిలో ఆదివారం ముఖ్య మంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.గత రెండు వారాలుగా ఆర్టీసీ సంఘాలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గుచేటు అని, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం భాధ్యత రాహిత్యమని మండి పడ్డారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్.మల్లేష్, అచ్చంపేట టౌన్ కార్యదర్శి శంకర్ నాయక్,ఐద్వా మహిళా
సంఘం నాయకురాలు ఏ.నిర్మల,సీఐటీయూ నాయకులు పి. గోపాల్,అచ్చంపేట తాలూకా అధ్యక్షులు సయ్యద్,ఎం. పర్వతాలు,వెంకటయ్య,జి. పర్వతాలు పాల్గొన్నారు.