ఆర్టీసి కార్మికుల నిరసన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసి సమ్మెలో భాగంగా అచ్చంపేట డిప్పొ ఉద్యోగులు,కార్మికులు,నాయకులు సమ్మెకు మద్దతుగా నిరసన తెలియజేస్తు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి నుండి ర్యాలీ మొదలై అంబెడ్కర్ విగ్రహం దాకా కొనసాగింది.అనంతరం అంబెడ్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే దాకా తమ పోరాటం కొనసాగుతుందని, అంతవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు.