ఆర్టీసి కార్మికుల ధర్నా
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి కార్మికుల సమ్మెను తీవ్రతరం చేసిన నేపథ్యంలో అచ్చంపేట డిపో కార్మికులు,ఆర్టీసి ఉద్యోగులు,నాయకులు ధర్నా నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న ధర్నా ప్రాంగణంలో ఈరోజు ధర్నా ను నిర్వహించిన నేపథ్యంలో తమ పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నట్లు వారు తెలిపారు. ఆర్టీసిని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో తెరాస ప్రభుత్వం ఉందని, ఆ నిర్ణయాన్ని ఉప సంహరించుకుని ప్రభుత్వంలో ఆర్టీసిని విలీనం చేసే దాకా పోరాడతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట డిపోకు చెందిన అందరు కార్మికులు,ఉద్యోగులు,నాయకులు పాల్గొన్నారు.