ఆర్టీసి కార్మికుల అరెస్ట్
తెలంగాణలో రాష్ట్రా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసి సమ్మెతో అచ్చంపేట డిప్పొలో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడపాలని అధికారులు ప్రయత్నించడంతో ఆర్టీసి కార్మికులు అడ్డుకున్నారు.
అడ్డుకున్న కార్మికుల పై పోలీసులు లాఠీ ఛార్జ్ జరిపి, 40మంది ఆర్టీసి కార్మికులను అదుపులోకి తీసుకొని అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.పండుగ సందర్భంగా సొంత ఊరుకు వెళ్ళేవారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.దానితో ఇదే అదునుగా బావించి రేట్లు విపరీతంగా పెంచి డబ్బులు దండుకుంటున్నారు.