ఆరోగ్య శ్రీ పథకానికి బ్రేక్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ పథకం నేటి నుంచి ఆగిపోతోంది. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆరోగ్య శ్రీకి సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం ఆధ్వర్యంలో బిల్లులు మంజూరు చేయాలనీ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా వారు మంజూరు కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.