ఆయుష్మాన్ భారత్ అమోఘం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ కొనియాడారు. ఈ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం దేశంలో కోట్లదిమంది పేదప్రజలు లబ్ధిపొందుతున్నారని ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్ మాదాపూర్‌లో అపోలో ఆసుపత్రుల ఆద్వర్యంలో రెండు రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నేషనల్ పేషంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ హెల్త్ కేర్ విత్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ అంతర్జాతీయ వైద్య సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిదిగా హాజరై ప్రసంగించారు. స్వతహాగా డాక్టరైన తాను తెలంగాణ గవర్నర్‌గా మొదటి కార్యక్రమంగా అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొని ప్రసంగించడం గౌరవంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను తీసుకువచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు.