ఆదిమ మానవుల అవశేషాలు
పట్టణానికి దగ్గరలోని అడవిలో ఆదిమానవుల అవశేషాలు బయల్పడ్డాయి.అచ్చంపేట మండలంలోని చౌటపల్లి గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో పూర్వీకుల నివాసగృహాలుగా భావిస్తున్న ఆనవాళ్లు కనిపించాయి.స్థానిక ప్రజలు వీటిని రాక్షస తెగకు చెందిన ఆదిమానవుల నివాస గృహాలుగా భావిస్తుంటారు.
రాకాసుల(రాక్షసుల) బండగా పిలుచుకునే ఈ ప్రాంతంలో పూర్వకాలంలో రాక్షసులు నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని జీవించేవారు అని చెప్పుకుంటారు.దాని పక్కనే వాగు ప్రవహిస్తుండడంతో తాగునీటి అవసరాలను తీర్చుకునే విధంగా వాడుకుని ఉండవచ్చునని,మానవులు సైతం ఎత్త లేనటువంటి బరువైన రాళ్ళతో గృహాలు ఏర్పాటు చేసుకోవడంతో వారి బలమైన శక్తిని అంచనా వేయవచ్చు.