ఆదయ పన్ను శాఖ సహాయంతో తక్కువ వడ్డీ రేటుకే ఇంటి రుణాలు.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) ప్రయోజనాలు సాధారణ ఎన్నికలకు ముందే మరింతగా ప్రజలకు చేరువకానున్నది, PMAY పథకం లో కొన్ని సవరణలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించడానికి ప్రభుత్వం ఆదాయ పన్ను డేటాను ఉపయోగించవచ్చు.
జాతీయ దినపత్రిక జాతీయ దినపత్రిక ప్రచురించిన నివేదికల ప్రకారం, మొదటిసారి గృహాల కోసం బ్యాంకు ల నుండి సబ్సిడీ రుణాల పొందేందుకు ఎదురు చూస్తున్న వారికీ ఇప్పుడు ఇదొక సువర్ణ అవకాశం అనే చెప్పవచ్చు. గృహ రుణాలపై రాయితీని సులభంగా పొందడానికి ఆదాయ పన్ను శాఖ సహాయపడనుంది.
PMAY ప్రకారం, అపార్టుమెంట్లు కొనుగోలు లేదా ఇళ్ళు నిర్మించటానికి 18 లక్షల రూపాయల వార్షిక ఆదాయం కలిగిన మొదటిసారి గృహస్థులకు, 20 సంవత్సరాల కాలానికి రు .6 లక్షల వరకు రుణాలు సబ్సిడీ పొందేందుకు అర్హులు. అలాగే 2.5-2.7 లక్షల ముందస్తు రాయితీతో వారు రుణంపై సబ్సిడీని పొందుతారు.
చిన్న వ్యాపారాల కోసం 59 నిమిషాల్లో రుణాలు లాంటి నూతన యంత్రాంగంతో ప్రభుత్వం ముందుకొచ్చింది తద్వారా అనేకమంది ప్రజలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు. ఈ నివేదికకు సంబందించిన వివరాలు ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిందని అన్నారు.
ఇటీవలి సమావేశంలో తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ బ్యాంకర్లతో వివరాలను చర్చించారు.ఐతే, తదుపరి వివరాలను హౌసింగ్ సెక్రటరీ DS మిశ్రా కమిటీ వచ్చే రెండు రోజులలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకాన్ని వచ్చే వరం రోజుల్లో అమలు చేయొచ్చని సమాచారం.