అసెంబ్లీలో యురేనియం తవ్వకాల పై మాట్లాడతా

ప్రజలకు హాని కలిగిస్తే తాను ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ గారు అన్నారు.నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే ఉద్యమంలో తామే ముందు ఉంటామని, ఈ ప్రాంతాన్ని రక్షించుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు.
అచ్చంపేట లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…తనపై విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై మాటలతో ఎదురుదాడికి దిగారు.నల్లమలలో ప్రజలను రెచ్చగొట్టి బందులు నిర్వహిస్తూ,ఇతరులను దూషిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.అచ్చంపేటకు మిషన్లు వచ్చాయని, వాటిని అడ్డుకోవాలని తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు.నేను, నా భార్య ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటే తవ్వకాలు కోసం అంటూ దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
యురేనియం తవ్వకాలు గురించి తాను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెతుతానని తెలియజేశారు.యురేనియం తవ్వకాల పై తాను ఎలాంటి సంతకం పెట్టలేదని, ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.